పేదవాడికి ఎప్పుడూ అండగా ఉండాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. నవంబర్ 15కు వారం అటూఇటుగా కులగణన ప్రక్రియ చేపడతామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కులగణనతోనే అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. కులగణన చేయాలని అనేక సంఘాలు ఉద్యమాలు చేశాయని, అందుకే కులగణన జరిపిస్తామని సీఎం జగన్ ప్రకటించారని తెలిపారు.