రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుంగార్పూర్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సుధాన్షి సింగ్ (22) హాస్టల్లో ఒంటరిగా ఉంటున్నాడు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.