జగనన్న చేదోడు 4 విడత ఆర్థిక లబ్ధి విడుదల చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న ఉ. 10. 30 గం. లకు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుండి కంప్యూటరు బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సచివాలయంలో జిల్లాకు చెందిన మంత్రులు, జెడ్పి ఛైర్మన్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.