ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా.. ఇజ్రాయెల్ అధికారులు ప్రైవేట్ విమానాలు, డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు ఆ దేశ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హమాస్, హిజ్బుల్లా డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు గాజా, లెబనాల్ సరిహద్దుల్లో జీపీఎస్ జామింగ్ను పెంచినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు తెలిపారు.