భార్య మరణ వార్త విని బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్ముకశ్మీర్‌లోని కుప్పారాలో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర యాదవ్ (28).. రాజస్థాన్‌లోని ధీర్పూర్ గ్రామంలో ఉన్న తన భార్య అన్షు యాదవ్ (24)తో గొడవపడ్డాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన అన్షు ఆత్మహత్య చేసుకుంది. ఆ మరణ వార్త విన్న రాజేంద్ర కూడా తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.