స్కిల్ స్కాంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బాబు పిటిషన్ పై సీఐడీ నేడు కౌంటర్ దాఖలు చేయనుండగా.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? అనే అంశంపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కాగా బాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వనుంది.