గాజాలోని ఓ ఆస్పత్రిపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూప్ ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గాజాలోని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఇస్లామిక్ జిహాద్ ప్రయోగించిన రాకెట్ మిస్ఫైర్ అయిన కారణంగా ఈ ఘటన జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. కాగా, ఈ ఘటనలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు.