పిడుగురాళ్ల పట్టణంలో రామ్ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ రామ్ పై బుధవారం ఓ యువకుడు దాడి చేసి గాయపర్చాడు. కారులో ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి వెళ్తుండగా రాంగ్ రూట్లో బైకుపై వచ్చిన ఓ యువకుడు కారును ఢీకొట్టాడు. కారు దిగి చూసుకుంటుండగా రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టిన యువకుడు డాక్టర్ రామ్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa