టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు భద్రత, ఆరోగ్యం విషయంలో అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతుందని మాజీ మంత్రి, రాజాం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ బుధవారం ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పధకం ప్రకారం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కి వైద్య పరీక్షలు చేసిన వెంటనే వాటికి సంబంధించిన నివేదికలు జైలు అధికారులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.