భర్త ఆత్మహత్యపై భార్య గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామానందం శివప్రసాద్ (40) పలువురికి షూరిటీగా ఉన్నాడు. వారు నెలనెలా కిస్తీలు చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న శివప్రసాద్ కు బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. ఒత్తిడితో ఇటీవల పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం భార్య శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్యకు కారణమైన నిందితుల్ని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.