గుంటూరు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా బుధవారం సత్తెనపల్లిలో పర్యటించారు. నిరుపయోగంగా ఉన్న జడ్పీ గెస్ట్ హౌసు తనిఖీ చేశారు. విలువైన ఆస్తులు నిరుపయోగంగా ఉండడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గెస్ట్ హౌస్‌ని వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా జడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ మరింతగా పెంచుతామన్నారు.