పల్నాడు జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. గురువారం ఉదయం శావల్యాపురం మండలం కారుమంచితో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలంతా భయంతో వణికిపోయి రోడ్లపై గుమిగూడారు. భూకంపం రిక్టర్ స్కేల్‌పై ఎంత నమోదైందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.