జగనన్న చేదోడు పథకం లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద నాలుగో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరుగుతున్న బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి పథకం నిధులను విడుదల చేశారు. మొత్తం 3,25,020 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. 325.02 కోట్లను జమ చేశారు. ఈ పథకం కింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.