ఓ భారీ తోకచుక్క భూమివైపు దూసుకొస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తోక చుక్క ఎవరెస్ట్ పర్వతం కంటే మూడు రెట్లు పెద్దగా ఉందని తెలిపారు. ఈ తోకచుక్క ఐస్, డస్ట్ తో పాటు క్రెయోమాగ్మా అనే గ్యాస్ తో నిండి సుమారు 30 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుందన్నారు. 12P/ Pons-Brooksగా పిలిచే ఈ కామెట్ గతంలో 1954లో ఓసారి కనిపించగా, మళ్ళీ 2024 ఏప్రిల్ 21న భూమికి అత్యంత చేరువుగా వస్తుందన్నారు. తిరిగి మళ్లీ 2095లో కనిపిస్తుందన్నారు