అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 65,443 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 19,570 దగ్గర ట్రేడవుతోంది. టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా తదితర కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి.