ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 10:33 AM

ప్రియుడితో కలిసి అత్తను హతమార్చిన ఘటన బెంగళూరులోని బ్యాడరహళ్లిలో చోటు చేసుకుంది. లక్ష్మమ్మ (50) కొడుకు మంజునాథ్‌తో రశ్మి అనే యువతి వివాహమైంది. వాళ్ల ఇంట్లో అద్దెకు ఉంటున్న అక్షయ్‌తో రశ్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అత్త లక్ష్మమ్మకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవైంది. దాంతో రశ్మి, అక్షయ్ కలిసి లక్ష్మమ్మను చంపాలనుకున్నారు. మత్తు మందు ఇచ్చి పీక పిసికి హతమార్చారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com