చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి…?. ఆయనేమైన దేవుడా, దిగొచ్చాడా…? అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారన్న కారుమూరి… వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా అంటూ ప్రశ్నలు గుప్పించారు. దేశ చరిత్రలో జైలులో ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినది చంద్రబాబుకే అని తెలిపారు. చంద్రబాబు చేసిన పాపాలు ఊరికేపోవు.. చంద్రబాబు పాలనంతా స్కాములే.. చట్టానికి అందరూ సమానులే.. చంద్రబాబు పైనుంచి దిగిరాలేదని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.