జమ్ముకశ్మీర్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న ఓ లారీ లోయలో పడింది. జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి ప్రాంతంలో లారీ లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa