వైసీపీ నేత, మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నేడు కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర ప్రమాదవశాత్తు సిమెంట్ బారికేడ్ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కారులోనే కొడాలినానితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని తెలుస్తోంది. ప్రమాదం అనంతరం అదే కారులోనే గుడికి వెళ్లారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ ఘటనపై పలువురు నేతలు ఆయనకి ఫోన్ చేసి ప్రమాదంపై పరామర్శించారు.