దాచేపల్లి నగర పంచాయతీ నారాయణపురంలో వివాహిత ఉరి వేసుకొని మృతి చెందింది. గ్రామానికి చెందిన యనమాల అనూష (22) ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవటాన్ని గురువారం కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ సంఘటన పై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.