భార్య పై దాడి చేసిన భర్త పై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బ్రాడీపేటలోని ఓ అపార్టుమెంట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న భర్త దేవీలాల్ నాయక్ కేతావత్ కల్యాణి విభేదించి రెండు సంవత్సరాల కిందట విడిపోయింది. ఈనెల 13న దేవీలాల్ నాయక్ భార్య వద్దకు వచ్చి గొడవపడి, కొట్టి దుర్భాషలాడాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.