విశాఖపట్నం జిల్లా, వేపగుంట బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం ఆయిల్ మిల్లు నుంచి కొత్తవలసకు ఆయిల్ లోడుతో వెళుతున్న మహింద్రా ఆటో ట్రక్ ఇక్కడి చేపల మార్కెట్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కకు పడిపోయింది. దీంతో ఆ వాహనంలో 60కు పైగా డబ్బాల్లో ఉన్న వంటనూనె రోడ్డుపాలైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష విలువైన వంటనూనె రోడ్డుపాలైంది. సమాచారం తెలుసుకున్న వెంటనే పెందుర్తి ట్రాఫిక్ ఎస్.ఐ. రమేశ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో డైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.