గిరిజనులు , అటవీ ప్రాంతాలలో ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నాకు దిగారు. తమ సాగులో ఏళ్ల తరబడి ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మండల రెవెన్యూ అధికారులు స్పందించి గిరిజనులకు, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి పకీరుకు వినతిపత్రం అందించి న్యాయం చేయాలని కోరారు. వీరికి మద్దతుగా సిపిఎం నాయకులు పాల్గొన్నారు.