నంద్యాల జిల్లాలోని పాండురంగాపురం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొండే పోగు చిన్న సుంకన్న హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ బిజెపి దే అధికారమని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు ఇంకా తీసుకొస్తారని తెలిపారు. అనంతరం కొండే పోగు చిన్న సుంకన్నను గ్రామస్తులు సత్కరించారు.