జగనన్న ఆరోగ్య సరక్ష కార్యక్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎర్రగుంట్ల మండలం చిర్రాజుపల్లి గ్రామంలోని స్కూల్లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సురక్ష కార్యక్రమంలో 66 రకాల వైద్య సేవలు 108 రకాల మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.