‘నిజం గెలవాలి’ పేరుతో వచ్చే వారం నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రంలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలానే చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో ఆయన తనయుడు నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు చెయ్యాలని నిర్ణయించారు.