టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు అనగా శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. గత విచారణ సందర్భంగా ఈ కేసులో నేటి వరకు అరెస్టు చేయవద్దంటూ సుప్రీం కోర్టు సీఐడీని ఆదేశించింది. కాగా శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా..? లేదా..? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం కేసులో గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును ఆరెస్టు చేయరాదని ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా పేర్కొన్న దృష్ట్యా.. ఫైబర్ నెట్ కేసులో కూడా ఇదే వర్తిస్తుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.