కన్న కొడుకుని, తండ్రి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘోర సంఘటన నంద్యాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... రోహిత్ అనే యువకుడు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రమేష్ రావుస్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేసే రిటైర్ అయ్యాడు. నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో ఆయన భార్య లక్ష్మీ మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక తాగుడుకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో కొడుకు రోహిత్‌తో తండ్రి రోజూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఇరువురిమధ్యగొడవ తీవ్రం కావడంతో ఇంట్లో ఉన్న కత్తితో కొడుకును పొడిచాడు. రోహిత్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల జీపీఎస్‌కు తరలించారు.