ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన, టీడీపీ శ్రేణులు ధర్నాకి పిలుపు, భారీగా పోలీసుల మోహరింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 12:10 PM

సీఎం జగన్ కృష్ణా జిల్లా, అవనిగడ్డ వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.93 కోట్ల రూపాయలు విడుదల చేసి నేటికీ సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో హామీల అమలు ఎప్పుడు అంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కార్యాలయం ఎదుట మహా ధర్నాకు పిలుపు ఇచ్చాయి. 144 వ సెక్షన్ అమలులో ఉందని ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు పలువురు టీడీపీ , జనసేన నేతలకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా మహాధర్నా నిర్వహించి తీరుతామని తెలుగుదేశం, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఇరుపార్టీల ముఖ్య నేతలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా వారి ఇళ్ళ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో అవనిగడ్డలో  ఉత్కంఠ నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com