మహిళల నిర్ణయాలు ఎవరి కంటే తక్కువేమీ కాదని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు అమ్మ లేద అత్తమ్మ లకు బానిసలు కారని పేర్కొంది. ఓ మహిళ విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు కొట్టి వేయగా, దీన్ని సవాలు చేస్తూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివాహ పవిత్రతకు లోబడి విభేదాలను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది.