యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే ఉంటారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమంతో భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్‌లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన అన్నారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందన్నారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించారు.