ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మిపై రాజధాని రైతులు తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటివారంలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. సీఆర్పీసీ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మొత్తం 22,948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.