మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన సుష్మా కక్డే అనే గర్భిణి బుధవారం రాత్రి.. ఐస్‌క్రీం కోసం తన నాలుగేళ్ల కుమారుడితో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. గురువారం వార్ధా నది వంతెన సమీపంలో సుష్మా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుష్మ మృతదేహం పక్కనే.. ఆమె నాలుగేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించిన దృశ్యం అందరిని కలిచి వేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.