తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక సీఎం జగన్ రెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించి జైలుపాలు చేశారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన ప్రసంగించారు.