ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శుక్రవారం ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో నమో భారత్‌ఎక్స్ రైలును ఫ్లాగ్ చేయడం ద్వారా భారతదేశ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హైస్పీడ్ ఆధునిక రైలు భారతదేశ భవిష్యత్తును, ఆర్థిక పురోగతితో అది ఎలా రూపాంతరం చెందుతోందో తెలియజేస్తుందని అన్నారు. సాహిబాబాద్ నుండి దుహై డిపోకు కలుపుతూ 17 కి.మీ ప్రాధాన్యత గల RRTS స్ట్రెచ్‌లో రీజినల్ ర్యాపిడ్ రైలు నమో భారత్‌లో మోడీ ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ ర్యాపిడ్‌ఎక్స్ స్టేషన్‌లో రైలును ఆయన ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి ర్యాపిడ్ రైల్ సర్వీస్ నమో భారత్ రైలు కార్యకలాపాలను ప్రారంభించడం దేశమంతటికీ ఇది చారిత్రాత్మక క్షణమని ప్రధాని అన్నారు. ఢిల్లీ-మీరట్ కారిడార్‌కు నాలుగేళ్ల క్రితమే శంకుస్థాపన చేశానని చెప్పారు.