ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తోందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కలకడ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి, అక్కడి సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకున్నారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.