ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ధోర్డో గ్రామం ఐక్యరాజ్య సమితి నుంచి బిరుదు పొందింది. కచ్, భుజ్ జిల్లాలకు చెందిన ధోర్డో గ్రామం గుజరాత్లోని సామాజిక, సాంస్కృతిక సంప్రదాయన్ని ప్రతిబింబిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలోని 54 ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ధోర్డో ఎంపికైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ గ్రామానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.