దేశం కోసం పోరాడి విధినిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిమట బాలాజీ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో బాలాజీ పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రజలకు ఏ ఆపద వచ్చిన ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్ మాత్రమే అన్నారు.