తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెదపరిమిలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను శనివారం ఎఒ శ్రీరంజని తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్, నిబంధనలకు అనుగుణంగా అమ్మకాలు జరుగుతున్నాయా, లేదా అనే విషయాలపై ఆరా తీశారు. రైతులు డీలర్ల వద్దనే ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని దుకాణాదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.