డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్, డివిజన్ సీనియర్ అధికారులతో కలిసి రాయగడ, బొబ్బిలి, విజయనగరం తదితర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు వివరాలను విశాఖలో వాల్తేరు డివిజన్ అధికారులు శుక్రవారం తెలిపారు. రైల్వే సౌకర్యాలు ప్రధానంగా దృష్టి సారించినట్టు డీఆర్ఎం తెలిపారు. విశాఖ నుంచి రాయగడ వరకు విండో ట్రైలింగ్ తనిఖీలు నిర్వహించారు.