శుక్రవారం అనగా నిన్న జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో వందల సంఖ్యలో పోలీసులు మోహరించి బంద్కు అనుమతి లేదని వ్యాపారులు షాపులు తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవనిగడ్డలో టీడీపీ, జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. దీనితో కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది.