నేడు ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు వంశీ కార్యాలయం ఎదుట కేక్ కటింగ్ చేసి.. బాణ సంచాలు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తని, పేదలకి అండగా నిలిచే వ్యక్తని కొనియాడారు. అయన కార్యాలయం ముందట వంశీకి జేజేలు కొడుతూ ఒక వేడుకలా చేసారు. అలానే ఈ సందర్భంగా పలు సామజిక సేవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినట్లు వారు తెలియజేసారు.