విజయవాడలో తెలుగు దేశం నాయకులు వంగవీటి రాధ కృష్ణను రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ శనివారం కలిశారు. ఆదివారం ఆయన వివాహం సందర్భంగా వారి నివాసంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్చాలు అందించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దాంపత్య జీవితం నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షించారు.