ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1995లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విపక్ష నేతలు, ప్రముఖులు సభ్యులుగా ఉంటారు.