వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ హిమాలయ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా దక్షిణ భారతదేశంలోని కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో ఈ మార్పు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.