నేపాల్‌లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3గా భూకంప తీవ్రత నమోదైంది. ఖాట్మండుకు సమీపంలో భూమికి 10 కి.మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ నెల మొదటి వారంలో కూడా నేపాల్‌లో వరుస భూకంపాలు సంభవించాయి.