కనగానపల్లి మండలం మామిళ్ల పల్లి గ్రామ సమీపాన 44వ జాతీయ రహదారిపై కంటైనర్ డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భూదాన్ జిల్లా, సాలేమాపూర్ గ్రామానికి చెందిన దుర్గాపాల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కంటైనర్లో చిప్స్ తీసుకొని వెళుతున్నాడు. మామిళ్ళపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా ఛాతిలో నొప్పి మొదలైంది. గుండె నొప్పి అధికం కావడంతో డ్రైవర్ సీట్లోనే కూర్చొని మృతి చెందాడు.