సంతనూతలపాడు మండలంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్సై బి ఆంజనేయులు హెచ్చరించారు. శనివారం ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అమాయకులను బెట్టింగ్ ద్వారా మోసం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. యువకులు సైతం బెట్టింగ్ నిర్వాహకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.