రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న దుస్థితి ఆవేదన కలిగిస్తోందని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ బివిఎస్ విజయకుమార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నీటి విడుదల ప్రణాళికలలో ప్రభుత్వ అసమర్థతే ప్రస్తుత సంక్షోభానికి కారణంగాఉందని, నాడు వృథా అని విమర్శించిన పట్టిసీమే నేడు దిక్కయిందని చంద్రబాబు దార్శనికత మరోసారి నిరూపితమైందని అన్నారు.