యుద్ధం కారణంగా నిర్వాసితులైన గాజా ప్రజలకు సాయం అందించేందుకు గాజా, ఈజిప్టుల మధ్య ఉన్న రఫా సరిహద్దు ఎట్టకేలకు శనివారం తెరుచుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలు, అంతర్జాతీయ సంస్థల విజ్ఞప్తితో ఈ సరిహద్దును తెరిచేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో సరిహద్దును తెరిచారు. 20 పెద్ద లారీల్లో సహాయక సామగ్రి శనివారం గాజాలోకి ప్రవేశించగా వాటిని చిన్న ట్రక్కుల్లో అవసరమైన ప్రాంతాలకు పంపనున్నారు.